Agni-V weight reduced, can now strike targets beyond 7,000 km: భారతదేశ ప్రతిష్టాత్మక బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 సామర్థ్యం మరింగా పెరిగింది. అగ్ని-5 బరువును గణనీయంగా తగ్గించడం వల్ల క్షిపణి మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం అగ్ని-5 ఏకంగా 7000 కిలోమీటర్ల దూరంలోకి లక్ష్యాలను సునాయాసంగా సాధించగలదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO) క్షిపణి బరువును 20 శాతం తగ్గించడం వల్ల అగ్ని-5 రేంజ్ ను 5000 కిలోమీటర్ల నుంచి 7000 కిలోమీటర్లకు పెరిగింది. క్షిపణిలో స్టీల్ కంటెంట్ తగ్గించడంతో పాటు వాటిని తేలికైన మిశ్రమ లోహాలతో భర్తీ చేయడం వల్ల అగ్ని-5 రేంజ్ పెరిగినట్లు రక్షణ రంగ అధికారులు ప్రకటించారు. 20 శాతం బరువు తగ్గించడం వల్ల అగ్ని-5 అణు సామర్థ్య వార్ హెడ్ లతో 7000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
Read Also: Quick Pregnancy : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఏం చెయ్యాలి? ఏ టైం లో కలవాలి?
అగ్ని క్షిపణుల సిరీస్ లో అగ్ని-3 దాదాపుగా 40 టన్నుల బరువుతో 3000 కిలోమీటర్లు లక్ష్యాలను ఛేదించగలదు. అయితే అగ్ని 4 క్షిపణి అగ్ని-3 కన్నా 20 టన్నుల బరువు తక్కువగా ఉంటుంది. ఇది ఏకంగా 4000 కిలోమీటర్ల వరకు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అయితే ఇప్పడు అగ్ని-5 గరిష్ట పరిమితి 5000 కిలోమీటర్లు అయినా.. బరువు తగ్గించడం వల్ల 7000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అవలీలగా చేధించగలదు. దీంతో యావత్ ఆసియా ఖండం మొత్తం అగ్ని-5 పరిధిలోకి వస్తుంది. అండమాన్ నికోబార్ కేంద్రంగా చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది.
రెండు రోజుల క్రితం అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది రక్షణ శాఖ. రాత్రిపూట ఈ ప్రయోగాన్ని విజయవంతంగా జరిపింది. గతంలో పోలిస్తే అగ్ని-5లో సాంకేతికత పెరిగింది. మూడు దశల్లో ఘన ఇంజన్లు క్షిపణికి చోధక శక్తిని ఇస్తాయి. అత్యంత ఖచ్చితత్వంతో ఇది టార్గెట్లను హిట్ చేయగలుగుతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని భారత్ తన క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోంది. అయితే ‘ నో ఫస్ట్ యూజ్’ అనే సొంత నియమానికి కట్టుబడి భారత క్షిపణి విధానం ఉంది.
