Site icon NTV Telugu

Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్ భారత లింకులపై దర్యాప్తు..

Bondi Beach Shooter

Bondi Beach Shooter

Australia terror attack: ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్ షూటింగ్ ఘటనపై సంచలనంగా మారింది. యూదులను టార్గెట్ చేస్తూ 50 ఏళ్ల సాజిద్, అతడి 24 ఏళ్ల కుమారుడు నవీద్‌లు కాల్పులకు తెగబడ్డారు. యూదులనకు సంబంధించిన హనుక్కా పండగ రోజుల కాల్పుల ఘటన జరిగింది. ఘటనాస్థలంలోనే సాజిద్‌ను అధికారులు హతమార్చగా, నవీద్‌పై హత్య, ఉగ్రవాదంతో సహా 59 నేరాల కింద అభియోగాలు మోపారు. అయితే, సాజిద్‌ ఇండియాతో సంబంధాలు ఉండటం, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతో కేంద్రం, రాష్ట్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి.

READ ALSO: Modi Magic on X: ఎక్స్‌లో మోడీ మ్యాజిక్… టాప్ 10లో 8 ప్రధానివే!

సాజిద్ ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం(PR) పొందడానికి 27 సార్లు ప్రయత్నించాడని, కానీ ఎప్పుడూ PR వీసాను పొందలేదని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. అయితే, అతనికి రెసిడెంట్ రిటర్న్ వీసా మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. 1998లో హైదరాబాద్‌లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో బీఏ పూర్తి చేసినట్లు తెలిసింది. దీని తర్వాత అదే ఏడాది నవంబర్‌లో విద్యార్థి వీసాపై సాజిద్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000 సంవత్సరంలో సాజిద్ ఆస్ట్రేలియాలో అప్పటికే PR హోదా ఉన్న వనెస్సాను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది సాజిద్ వీసా పార్ట్‌నర్ వీసాగా మారింది. 2008లో అతను రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందాడు.

సాజిద్‌కు 2001లో నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. అతడికి శాశ్వత నివాస హోదా లభించింది. 2003లో సాజిద్ తన భార్య వెనెస్సాతో కలిసి భారత్‌ వచ్చాడు. వారిద్దరు ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం, భారత్‌లో మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 2004లో సాజిద్ తన కొడుకును తన బంధవులకు పరిచయం చేయడానికి భారత్ తీసుకువచ్చాడు. 2006లో తన తండ్రి మరణానంతరం సాజిద్ మరోసారి భారత్ వచ్చాడు. 2012లో మరోసారి భారత్ వచ్చాడు, చివరిసారిగా 2018లో భారత్ వచ్చినట్లు తెలిసింది. ఆ సమయంలో హైదరాబాద్‌తో తన వారసత్వ ఆస్తిని విక్రయించాడు. అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును అతను ఆస్ట్రేలియాలో ఇళ్లు కొనుగోలుకు ఉపయోగించాడు. శాశ్వత హోదా లేనప్పటికీ సాజిద్ ఆస్ట్రేలియాలో ఎలా నివసించగలిగాడు అనే దానిపై ఎజెన్సీలు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాయి. అతడి ఆర్థిక లావాదేవీలు, వీసా పొడగింపులు, సుదీర్ఘకాలం పాటు విదేశాల్లో నివాసం ఉండటంపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

Exit mobile version