NTV Telugu Site icon

New Delhi:రాహుల్ ప‌బ్ వీడియో త‌ర్వాత.. మ‌రో వీడియో వైర‌ల్

Rahul

Rahul

రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్ లో పార్టీ చేసుకుంటున్న వీడియోను ఈసారి బీజేపీ రిలీజ్ చేసింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుకుతూ పలు విమర్శలకు దారి తీస్తోంది.

ఐఎన్‌సీ అంటే ‘ఐ నీడ్ సెల‌బ్రేష‌న్ అండ్ పార్టీ’ అంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షెహ‌జాద్ పూనావాలా ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. మ‌హారాష్ట్ర ప్ర‌దేశ్ యూత్ కాంగ్రెస్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు శిక్ష‌ణా శిబిరంలో పాల్గొన్నారా లేక పార్టీలో చిందులు వేశారా అని పూనావాలా రాసుకొచ్చారు.

రాహుల్ గాంధీ నేపాల్ ప‌బ్‌లో గ‌డిపితే జూనియ‌ర్ నేత‌లు పార్టీ శిక్ష‌ణా శిబిరంలో చిందులు వేశార‌ని అన్నారు. నేత ఎలా ఉంటే కార్య‌క‌ర్త‌లు అలా త‌యార‌వుతార‌ని అన్నారు. 24 సెకండ్ల వ్య‌వ‌ధి క‌లిగిన ఈ వీడియోలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులు వేశారు.

Show comments