Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News After Pawan Kalyan Kangana Ranaut Outrage Over Sharmistha Panolis Arrest

Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..

Published Date :June 1, 2025 , 4:37 pm
By Venu Goapl Reddy
  • శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్‌తో జతకలిసిన కంగనా రనౌత్..
  • మమతా బెనర్జీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు..
Sharmistha Panoli Arrest: పవన్ కళ్యాణ్ తర్వాత, కంగనా రనౌత్.. శర్మిష్ట పనోలి అరెస్ట్‌పై ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sharmistha Panoli Arrest: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ట పనోలి అరెస్ట్‌పై బీజేపీ సహా ఎన్డీయే నేతలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శర్మిష్ట పోస్ట్ చేసిన వీడియో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని చెబుతూ, బెంగాల్ పోలీసులు శుక్రవారం ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడులపై కొంతమంది బాలీవుడ్ నటులు మౌనంగా ఉన్నారని ఆమె విమర్శిస్తూ వీడియో చేశారు. అయితే, కొంతమంది ఈ వీడియోపై అభ్యంతరం తెలపడంతో, దానిని డిలీట్ చేసి, క్షమాపణలు కూడా చెప్పారు.

అయితే, ఆమెకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. పవన్ తర్వాత బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చి, వెంటనే ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘శర్మిష్ట తన వ్యక్తీకరణ కోసం కొన్ని అసహ్యకరమైన పదాలను ఉపయోగించారని నేను అంగీకరిస్తున్నాను, కానీ ఈ రోజుల్లో చాలా మంది యువకులు అలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఆమె తన ప్రకటనలకు క్షమాపణలు చెప్పింది, అది చాలు, ఆమెను మరింత బెదిరించడం, వేధించడం అవసరం లేదు. ఆమెను వెంటనే విడుదల చేయాలి’’ అని అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఉత్తర కొరియాగా మార్చవద్దని నేను కోరుతున్నారు. అందరికీ ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి.’’ అని కంగనా అన్నారు.

Read Also: Ali : కమెడియన్ అలీకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..

కంగనాకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మమతా చేసిన వ్యాఖ్యల్ని ఎత్తిచూపారు. “విభజన రాజకీయాల ద్వారా మత అల్లర్లను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని , దాని “మురికి ధర్మం” హిందూ మత సూత్రాలకు విరుద్ధమని మమతా బెనర్జీ అన్నారు.

అయితే, ఈ వీడియోని పవన్ కళ్యాణ్ షేర్ చేస్తూ.. ‘‘పశ్చిమ బెంగాల్ పోలీసులు శర్మిష్టపై వేగంగా చర్య తీసుకున్నారు. కానీ ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన తీవ్రమైన బాధ సంగతి ఏంటి? మన విశ్వాసాన్ని ‘గంధ ధర్మం’ అని పిలిచినప్పుడు ఆగ్రహావేశాలు ఎక్కడ ఉన్నాయి? వారి క్షమాపణ ఎక్కడ? వారి అరెస్టు ఎక్కడ?’’ అని ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kangana Ranaut
  • pawan kalyan
  • Sharmistha Panoli
  • Sharmistha Panoli arrest
  • Sharmistha Panoli video

తాజావార్తలు

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

  • Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

  • Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

  • Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ అలలు

  • Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions