ఓ విడాకుల కేేసులో కర్ణాటక హైకోర్ట్ సంచనల తీర్పు వెల్లడించింది. వివాహాన్ని రద్దు చేసుకున్నతర్వాత మహిళకు సంబంధించి వస్తువులను ఆమె భర్త తన వద్ద ఉంచుకోలేదరని తీర్పు వెల్లడించింది. ముంబైకి చెందిన వ్యక్తి తనపై మాజీ భార్య చేసిన ఫిర్యాదును బెంగళూర్ కోర్ట్ లో సవాల్ చేశాడు. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తికి మహిళకు 1998లో డిసెంబర్ లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ‘ స్త్రీ ధాన్ ’ కింద రూ. 9 లక్షలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం వివాహం రద్దు చేసుకున్న తరువాత తన డబ్బును రూ. 9 శాతం వడ్డికీ ఇవ్వాలని మహిళ కోరింది. ఈ విషయమై 2009లో భర్త, అత్తా మామలపై సదరు మహిళ ఫిర్యాదు చేసింది.
2018లో ఈ కేసులో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదరు వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తమ వివాహాన్ని బాంబే హైకోర్ట్ రద్దు చేసిందని.. తన మాజీ భార్యకు శాశ్వత భరణం కింద రూ. 4 లక్షలు చెల్లించాని కోర్టుకు చెప్పాడు. ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్న తరువాత భర్త చెల్లించే భరణంలో తను ఇచ్చిన కట్నం రూ. 9 లక్షలు లేదని సదరు మహిళ కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో భర్త చెల్లించే భరణం నుంచి రూ. 9 లక్షలు వేరుగా ఉన్నాయని.. విడాకుల తర్వాత భార్య తెచ్చిన వస్తువులన్నింటినీ కుటుంబ సభ్యులు తమ వద్ద ఉంచుకోలేరని న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు.