NTV Telugu Site icon

Chhatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కి రానున్న శివాజీ ఆయుధం..

Shivaji

Shivaji

Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ మహారాజ్ 1659లో వాడిని ఆయుధం పులి పంజా ఆకారంలో ఉండే ‘వాఘ్ నఖ్’ భారతదేశానికి రాబోతోంది. నవంబర్ నెలలో లండన్ నుంచి భారత్ కి ఈ ఆయధాన్ని తీసుకురానున్నారు. దీన్ని తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ అవసరమైన ఒప్పందంపై మంగళవారం లండన్ లో సంతకాలు చేయనున్నారు.

ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషఏకం చేసి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ‘వాఘ్ నఖ్’ ఆయుధాన్ని స్వదేశానికి తీసుకురానున్నారు. మూడు సంవత్సరాల ప్రదర్శన కోసం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి పులి పంజా ఆయుధాన్ని తీసుకువస్తున్నారు.

Read Also: Apple iPhone 15: హీట్ అవుతున్న ఐఫోన్ 15 ఫోన్లు.. కారణాలు గుర్తించిన యాపిల్..

‘‘మొదటి దశలో మేము వాఘ్ నఖ్ ను తీసుకువస్తున్నాము. నవంబర్ లో ఇక్కడికి తీసుకురావాలి, దాని కోసం మేము ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తున్నాము. శివాజీ బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్ ను ఈ ఆయుధంతోనే సంహరించారు.’’అని సుధీర్ ముంగంటివార్ అన్నారు. ముందుగా వాఘ్ నఖ్ ను దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉంచుతారు. దీంతో పాటు దేశంలోని మరో నాలుగు ప్రాంతాల్లో ఈ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మ్యూజియం వర్గాలు తెలిపాయి.

1659లో జరిగిన ప్రతాప్‌గఢ్ యుద్ధంలో శివాజీ యుద్ధం చేసి అఫ్జల్ ఖాన్ ను చంపేసి ఆదిల్షాహీ దళాలను ఓడించారు. తక్కువ సైనిక బలం ఉన్నప్పటికీ అప్జల్ ఖాన్ సేనల్ని శివాజీ ఓడించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రతాప్ గఢ్ కోట ముందు అప్జల్ ఖాన్ ని చంపారు. క్రూరుడైన అప్జల్ ఖాన్ ను చంపడానికి వాఘ్ నఖ్ ని ఉపయోగించారని సుధీర్ ముంగంటివార్ అన్నారు. వాఘ్ నఖ్ మాకు ప్రేరణ , శక్తి అని ఆయన తెలిపారు.

Show comments