NTV Telugu Site icon

African Swine Fever: కేరళలో మరో వైరస్ కలకలం.. పందులను చంపేయాలని ఆదేశం

African Swine Fever

African Swine Fever

African swine fever found in Kerala: కేరళలో మరోసారి కొత్త వైరస్ బయటపడింది. ఇప్పటికే దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలోనే తొలుత బయటపడ్డాయి. తాజాగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు కేరళలో నమోదు అయినట్లు పశువర్థక శాఖ మంత్రి జే చించురాణి శుక్రవారం వెల్లడించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలోని మనంతవాడి పందుల ఫారాల్లో ఈ వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇటీవల వరసగా పందులు మూకుమ్మడిగా చనిపోవడంతో పశువైద్యాధికారులు వీటి నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌ కు పంపారు. దీంతో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం పందుల ఫారాల్లో ఉన్న 300 పందులను చంపేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పరిసరాల్లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పందులను చంపాలని యోచిస్తున్నారు.

Read Also: Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన

వయనాడ్ తో పాటు నార్త్ కేరళలో మరో జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. గతంలో బీహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాధి సోకింది. తాజాగా కేరళలో ఈ వ్యాధి బయటపడింది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందులను ప్రభావితం చేస్తే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ప్రస్తుతం కేసులు రావడంతో కేరళ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువుల నుంచి మానవులకు ఈ వ్యాధి సంక్రమించడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వయనాడ్ జిల్లాతో పాటు కోజికోడ్ జిల్లా కూడా అలర్ట్ అయింది. అయితే బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కనిపించడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం గత రెండు వారాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పందులు, వాటి మాంసాన్ని రవాణా చేయడాన్ని నిషేధించింది. ప్రజలు రెడ్ మీట్ ను తినడానికి ముందు బాగా ఉడికించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అటవీ, పెంపుడు పందుల్లో వ్యాపించే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన అంటువ్యాధి అని.. దీనివల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. మానవుకు కూడా ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Show comments