NTV Telugu Site icon

Aditya L1: భూమికి గుడ్ బై.. సూర్యుడి దిశగా 15 లక్షల కి.మీ ప్రయాణం..

Aditya L1

Aditya L1

Aditya L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 తన లక్ష్యం దిశగా పయణమైంది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో చక్కర్లు కోట్టిన శాటిలైట్ ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటిసే సూర్యుడి దిశగా వెళ్తోంది. భారత మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్(L1) దిశగా వెళ్తోందని ఇస్రో మంగళవారం ప్రకటించింది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్((TL1I) విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది.

Read Also: UNESCO: “హొయసల” ఆలయాలకు యునెస్కో గుర్తింపు.. 42కి చేరిన యునెస్కో వారసత్వ గుర్తింపు

ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 2న విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. భూమి గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకోవడంతో పాటు వేగాన్ని పుంజుకునేందుకు భూమి చుట్టూ తిరిగింది. పలు దశలుగా ఆదిత్య-ఎల్1 కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు పెంచుతూ వెళ్లారు. ఇప్పుడు భూమికి-సూర్యుడికి మధ్య ఉండే పరస్పర గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉండే L1 పాయింట్ వైపు ప్రయాణిస్తోంది. 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉండే ఈ పాయింట్ వద్దకు చేరుకునేందుకు దాదాపుగా 110 రోజులు పడుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత హాలో కక్ష్యలో ఉంటూ సూర్యుడిపై అధ్యయనం చేస్తుంది.

సూర్యుని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాను అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అంతరిక్ష వాతావరణం యొక్క డైనమిక్స్ , కణాలు, క్షేత్రాల వ్యాప్తిని కూడా పరిశోధిస్తుంది. సౌర తుఫానులు, సూర్యుడిపై విస్పోటనాలు, కరోనాల్ మాస్ ఎజెక్షన్స్ వంటి వాటిని గురించి పరిశోధిస్తుంది. ఇస్రో చంద్రయాన్ -3 విజయవంతం తరువాత ఆదిత్య-ఎల్1నివ ప్రారంభించింది.