Site icon NTV Telugu

Adina mosque: ఆదినా మసీదా లేదా ఆదినాథ్ ఆలయమా.? యూసఫ్ పఠాన్ వివాదం..

Adina Mosque

Adina Mosque

Adina mosque: మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని ‘‘ఆదినా మసీదు’’ను సందర్శించారు. సందర్శించిన సమయంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. తన పోస్టులో ‘‘ ఆదినా మసీదు ఒక అద్భుతమని ’’ చెప్పాడు. దీంతో ఒక్కసారిగా యూసఫ్ పఠాన్‌పై బీజేపీ, సోషల్ మీడియా నెటిజన్ల నుంచి విమర్శలు ప్రారంభయ్యాయి.

ఆదినా మసీదు అనేది ఒకప్పుడు ‘‘ఆదినాథ్ ఆలయం’’ అని నెటిజన్లు చెబుతున్నారు. ఆలయంపై మసీదు నిర్మించడిందని ఎత్తిచూపారు. చారిత్రక ఆధారాల కోసం గణేషుడు, శివుడిని పోలిన దేవతల చిత్రాలను నెటిజన్లు ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ‘‘ఆదినా మసీదు 14వ శతాబ్ధంలో ఇలియాస్ షాహి రాజవంశ రెండో పాలకుడు సుల్తాన్ సికిందర్ షా నిర్మించిన చారిత్రక మసీదు. దీనిని 1373-1375లో నిర్మించారు. ఇది భారతదేశ ఉపఖండంలో అతిపెద్ద మసీదు. ఆ సమయంలో ఈ ప్రాంత నిర్మాణ వైభవాన్ని ప్రదర్శిస్తుంది’’ అని యూసఫ్ పఠాన్ ట్వీట్ చేశాడు. బెంగాల్ బెహ్రంపూర్ నుంచి ఎంపీగా ఉన్న యూసఫ్ పఠాన్, దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

ఆదినా మసీదు వివాదం:

2022లో బీజేపీ బెంగాల్ ఉపాధ్యక్షుడు రతీంద్ర బోస్ ఆదినాథ్ మందిర్ మసీదు కింద సమాధి చేయబడిందని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ‘‘ఆదినాథ్ మందిరం ఈ ఆదినా మసీదు కింద్ర నిద్రిస్తుంది. ఆ చరిత్ర చాలా మందికి తెలియదు’’ అని బోస్ ట్వీట్ చేశారు. వారణాసిలో జ్ఞాన్‌వాపి మసీదు సమస్యతో సహా అనేక రాష్ట్రాల్లో అనేక ఆలయ-మసీదు వివాదాలు నడుస్తున్న సమయంలోనే ఈ ట్వీట్ వచ్చింది.

2024లో హిందూ పూజారి హిరన్మోయ్ గోస్వామి భక్తులతో కలిసి ఆదినా మసీదు ప్రాంగణంలో పూజలు చేయడంతో ఈ సమస్య మళ్లీ వెలుగులోకి వచ్చింది. తాను మసీదుకు వెళ్లిన సమయంలో హిందూ సంస్కృతికి చెందిన శివలింగం, ఇతర చిహ్నాలను కనుగొన్నట్లు గోస్వామి తెలిపారు.

జ్ఞానవాపి, కృష్ణ జన్మభూమి కేసుల్లో ప్రమేయం ఉన్న సీనియర్ న్యాయవాది హరి శంకర్ జైన్ ఈ వివాదాన్ని లేవనెత్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు రాసిన తర్వాత ఈ సమస్యకు మరో టర్న్ తీసుకుంది. తన లేఖలో, మసీదు సముదాయంలో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతి కోరాడు.

ఆలయమా..? మసీదా..?

సుల్తాన్ సికిందర్ షా మరణించిన కొంతకాలం తర్వాత మసీదు నిర్మాణం ప్రారంభమైంది. బెంగాల్ సుల్తాన్ సామ్రాజ్యానికి చిహ్నంగా మారిన ఈ సముదాయంలోనే అతడిని సమాధి చేశారు. అనేక ఏళ్లుగా అనేక పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఈ మసీదును పూర్వం హిందూ, బౌద్ధ మందిరాల శిథిలాలను ఉపయోగించి నిర్మించారని వాదించారు. ‘‘ఆదినా’’ అనేది శివుడి పేరు అయిన ‘‘ఆదినాథ్’’ నుంచి వచ్చిందని వారు చెప్పారు.

తాజాగా, యూసఫ్ పఠాన్ పోస్టు తర్వాత అనేక మంది నెటిజన్లు మసీదు లో ఉన్న పూలు, తామరలు, దేవతల చిత్రాలను షేర్ చేవారు. మసీదు పునాది భారీ బసాల్ట్ రాతితో తయారు చేయబడింది. ఇది హిందూ దేవాలయానిక ఉండే లక్షణం. బ్రిటిష్ ఇంజనీర్ మరియు పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ (1879-80), బంగ్లాదేశ్ చరిత్రకారుడు ఎస్కే సరస్వతి మసీదు నిర్మాణంలో హిందూ పుణ్యక్షేత్రాల నుండి పదార్థాల వినియోగాన్ని ప్రస్తావించారని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.

Exit mobile version