Site icon NTV Telugu

Congress: పార్లమెంట్ భద్రతా లోపం, మా ఎంపీలు దుండగులను అడ్డుకున్నారు.. భద్రతా సిబ్బంది ఎక్కడ..?

Congress

Congress

Congress: పార్లమెంట్‌లో భద్రత ఉల్లంఘనపై విపక్షాలు, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ఛాంబర్‌లోకి ప్రవేశించి, ఎల్లో రంగులో పొగను వెదజల్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు పార్లమెంట్‌లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్ష చేయనున్నారు. పార్లమెంట్‌కు చేరుకున్న ఢిల్లీ సీపీ, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాలు దాడిపై దర్యాప్తు ప్రారంభించారు. దాడి ఘటనతో విజిటర్స్‌ పాస్‌లను స్పీకర్ రద్దు చేశారు. దాడికి పాల్పడ్డవారిని సాగర్‌ శర్మ, అమోల్‌ షిండే, నీలమ్‌ కౌర్, మనోరంజన్‌గా గుర్తించారు.

Read Also: Imran khan: ఆర్టికల్ 370 తీర్పు చట్టవిరుద్ధం.. సుప్రీం తీర్పుపై పాక్ మాజీ ప్రధాని..

దాడి తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. భద్రత ఏర్పాట్లపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. ఈ రోజు డిసెంబర్ 13, 2001 రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించాము, ఈ దాడి జరిగిన రోజే మరో ఘటన చోటు చేసుకుందని, దీనిపై జాగ్రత్తలు తీసుకోలేదా..? అంటూ ఆయన ప్రశ్నించారు. మా ఎంపీలు నిర్భయంగా వారిని పట్టుకునేందుకు చూశారన్నది నిజం, అయితే మన పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఎక్కడ ఉన్నారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version