NTV Telugu Site icon

Gautam Adani: రైలు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు ఉచితంగా విద్య..

Gautam Adani

Gautam Adani

Gautam Adani: ఒడిశా బాలాసోర్ రైల్ దుర్ఘటన వందల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను తీసుకుంది. 288 మంది ప్రయాణికులు మరణించారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న పట్టాలపై బోగీలు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ మళ్లీ ఈ బోగీలను ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు తెలియరానున్నాయి. మూడు దశాబ్ధాల్లో అత్యంత ఘోరమైన ప్రమాదంగా బాలాసోర్ ట్రైన్ దుర్ఘటన చరిత్రలో నిలిచింది.

Read Also: Mumbai Bus Accident: భయంకరమైన యాక్సిడెంట్.. చూసి షాకవుతారు

ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా విద్యను అందిస్తామని బిలియనీర్, ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ తెలిపారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం కలిచివేసిందని.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందిస్తామని ప్రతిపాదించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడం, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం అందరి ఉమ్మడి బాధ్యత అని ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో మనమందరం తీవ్రంగా కలత చెందాము. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన అమాయకుల పాఠశాల విద్యను అదానీ గ్రూప్ చూసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. బాధితులు మరియు వారి కుటుంబాలు మరియు పిల్లలకు మంచి రేపటిని అందించండి’’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.

Show comments