Site icon NTV Telugu

Adani Iron Bridge: 90 అడుగుల ఐరన్ బ్రిడ్జ్‌ని దొంగలించిన దుండగులు.. ఎలా దొరికారంటే?

Adani Bridge Stone

Adani Bridge Stone

Adani Company 6000kg Iron Bridge Stolen In Mumbai Malad: బిహార్‌లో రైలు ఇంజిన్, రైలు పట్టాలను దొంగలించడం వంటి విచిత్రమైన సంఘటనల గురించి మీరంతా వినే ఉంటారు. సరిగ్గా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అదానీ కంపెనీకి సంబంధించిన ఓ ఐరన్ బ్రిడ్జ్‌ని నలుగురు దుండగులు చోరీ చేశారు. అయితే.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, దొంగల్ని పట్టుకోగలిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Dunki: రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన డంకీ డిజిటల్ రైట్స్

అదానీ కంపెనీ గత సంవత్సరం ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక తాత్కాలిక ఇనుప వంతెనని నిర్మించింది. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించడం కోసమే దీనిని నిర్మించడం జరిగింది. అయితే.. కొన్ని రోజుల తర్వాత దాని పక్కనే మహారాష్ట్ర ప్రభుత్వం మరో వంతెనని ఏర్పాటు చేసింది. ఈ వంతెని అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి.. అదానీ కంపెనీకి చెందిన ఆ ఇనుప వంతెనని వినియోగించడం మానేశారు. ఆ వంతెన 90 అడుగులు, 6000 కిలోల బరువు ఉంటుంది. అలాంటి వంతెన.. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయం అయ్యింది. మ్యాజిక్ షోలలో కళ్ల ముందే ఏనుగుని మాయం చేసినట్టు.. రాత్రికి రాత్రే ఈ వంతెన కనిపించకుండా పోయింది.

Palak Puraswani: వాడు దారుణంగా మోసం చేశాడు.. బెడ్రూంలో నటితో శృంగారం చేస్తూ..

దీంతో అవాక్కయిన అదానీ కంపెనీ.. తమ వంతెనని ఎవరో దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతైనా అదానీ కంపెనీకి చెందినది కదా.. ఈ కేసుని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. మొదట్లో ఈ కేసు పోలీసులకు కాస్త సవాలుగా మారింది. ఎందుకంటే.. దొంగలించబడ్డ ఈ వంతెనకి దగ్గరలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. దీంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడే పోలీసులకు జూన్ 11వ తేదీన ఓ భారీ ట్రక్కు వెళ్లడాన్ని గమనించారు. దాంతో.. కచ్ఛితంగా వంతెనని అందులోని తరలించి ఉంటారని నిర్ధారణకి వచ్చారు.

Video Viral: ఆడవాళ్ల గొడవలో తలదూర్చొద్దు అని ఊరికే చెప్పారా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో..

తొలుత సీసీటీవీ కెమెరాలో చిక్కిన ట్రక్కు డీటెయిల్స్‌ని కనుక్కున్నారు. అక్కడి నుంచి దర్యాప్తు వేగవంతం చేసి, చివరికి ఆ వంతెనని చోరీ చేసిన నలుగురు దొంగల్ని పట్టుకున్నారు. ఇక్కడ షాక్‌కి గురి చేసే విషయం ఏమిటంటే.. ఈ వంతెన నిర్మాణ సమయంలో పని చేసిన వ్యక్తే, ఈ చోరీలో ప్రధాన నిందితుడిగా తేలాడు. గ్యాస్ కట్టర్లతో ఆ వంతెనని ముక్కలు ముక్కలు చేసి, భారీ ట్రక్కు ద్వారా తరలించినట్టు విచారణలో తేలింది. ఈ వంతెన వినియోగంలో లేదు కాబట్టే, వాళ్లు ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది.

Exit mobile version