Site icon NTV Telugu

సోనూసూద్‌ కీలక నిర్ణయం

నటుడు సోనూసూద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సోదరి మాళవిక సూద్‌ రాబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ నున్నట్టు ఆదివారం ప్రకటించారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతు న్నారనే విషయంపై స్పష్టత లేదు. సరైన సమయంలో దీనికి సంబం ధించిన ప్రకటనను విడుదల చేస్తామని సోనూసూద్‌ వెల్లడించారు. మోగాలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటనను చేశారు.

సోనూసూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ సీఎం చరణ్‌ జీత్‌సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూసూద్‌ ఢీల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌తోనూ భేటీ అయ్యారు. ఢీల్లీ ప్రభుత్వం చేపట్టిన “దేశ్‌ కా మెంటార్స్‌” అనే కార్యక్రమానికి సోనూసూద్‌ బ్రాండ్‌ అంబా సిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా కరోనా కష్ట సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో సోనూసూద్‌ ప్రజల ఆదర అభిమానాలను చూరగొని రియల్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికి తెల్సిందే..

Exit mobile version