NTV Telugu Site icon

Arun Bali passes away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత..

Arun Bali

Arun Bali

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా, బాలీవుడ్​ సీనియర్​ నటుడు అరుణ్​ బాలి కన్నుమూశారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు.. దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం 4.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు ఆయన కుటుంబసభ్యులు.. ఆయన చివరిగా అమీర్ ఖాన్-కరీనా కపూర్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటించారు.. 1942లో పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన అరుణ్ బాలి.. 1989లో దూస్రా కేవాల్‌తో టీవీ రంగ ప్రవేశం చేశాడు. అతను ‘3 ఇడియట్స్’, పీకే, ‘కేదార్‌నాథ్‌,’, ‘పానిపట్’ పీకే, వంటి అనేక చిత్రాల్లో మంచి పాత్రలో పోషించారు.. వాటితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Read Also: TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్‌మెంట్లు ఫుల్

అరుణ్‌ బాలి 1991 పీరియడ్ డ్రామా చాణక్యలో కింగ్ పోరస్ పాత్రను, దూరదర్శన్ సోప్ ఒపెరా స్వాభిమాన్‌లో కున్వర్ సింగ్ పాత్రతో విమర్శకుల ప్రశంసలు పొందారు.. 2000లో వచ్చిన హే రామ్‌ చిత్రంలో బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి హుసేన్ షహీద్ సుహ్రవర్ది పాత్రలో నటించి మెప్పించారు.. ముఖ్యంగా 2000లలో ఆయన తాత పాత్రలకు ప్రసిద్ధి చెందారు.. హిందీ సీరియల్ కుంకుమ్ ప్యారా సా బంధన్‌ ఆయనకు ఎంతో పేరుతెచ్చిపెట్టింది.. కుంకుమ్‌లో హర్షవర్ధన్ వాధ్వా పాత్ర ఆయనకు అవార్డులను తెచ్చిపెట్టింది. అతను నేషనల్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ అని కూడా చెబుతుంటారు.. ఇక, అరుణ్ బాలి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.. సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలిపారు.

Show comments