NTV Telugu Site icon

Amitabh Jha: యూఎన్ శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..

Un Peacekeeping Force

Un Peacekeeping Force

Amitabh Jha: ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లోని గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్యసమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(యుఎన్‌డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్‌సి)గా పనిచేస్తున్న బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆయన మరణించే సమయంలో మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు. ఆయన మరణం పట్ల భారత సైన్యం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా సీనియర్ సైనిక కమాండర్లు సంఘీభావం ప్రకటించారు. ఆయన మృతికి కారణాలను ఆర్మీ వెల్లడించలేదు.

Read Also: Crime: ‘‘రా’’ ఏజెంట్‌గా నటిస్తూ, కెనడా మహిళపై అత్యాచారం..

ప్రస్తుతం ఆయన భౌతికకాయం భారత్ చేరుకుంటుంది. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సేవ చేసిన ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గోలన్ హైట్స్ తీవ్ర ఉద్రిక్త ప్రాంతంగా ఉంది. 1974 నుండి UNDOF పర్యవేక్షణలో ఉన్న ఈ ప్రాంతం ఇజ్రాయెల్ మరియు సిరియా మధ్య ఒక బఫర్ జోన్. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని నివారించేందుకు యోమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత దీని స్థాపన జరిగింది.

గత కొన్ని నెలలుగా గోలన్ హైట్స్ ప్రాంతంలో సిరియన్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న శాంతి పరిరక్షణ దళం, సాధారణ ప్రజలు భద్రతా సమస్యలు ఎదుర్కొన్నారు. బ్రిగేడియర్ ఝాతో సహా శాంతి పరిరక్షక దళం కాల్పుల విరమణ ఒప్పందాలను పర్యవేక్షించడంలో, మానవతా ప్రయత్నాలను సులభతరం చేయడంలో, ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న పౌరులకు భద్రత ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.

Show comments