Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ..
- ఎంపీ అభిషేక్ బెనర్జీ దాడితో రాజకీయ ఉద్రిక్తత..
- టీఎంసీ అంతర్గత పోరు ఫలితమే ఈ దాడి అని బీజేపీ ఆరోపణ..
- దాడి వెనక బీజేపీ ఉందని టీఎంసీ వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Banerjee: మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీపై దాడి అంశం బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తత పెంచింది. శనివారం సోనార్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అభిషేక్‌పై స్థానికులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే, తనపై దాడి చేసింది బీజేపీనే అని ఆయన ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేస్తూ.. పాలకులు హంతకులుగా మారారని అన్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారింది.
ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం అభిషేక్‌పై దాడి ఘటన టీఎంసీ అంతర్గత వర్గపోరు ఫలితమే అని చెబుతోంది. దాడికి సంబంధించి అరెస్ట్ అయిన ఆరుగురు వ్యక్తులు ఇటీవల వరకు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు సన్నిహితులని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఆరోపించారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పోరు వలన జరిగిందే అని ఆయన అన్నారు.
Also Read
అయితే, బీజేపీ ఆరోపణల్ని టీఎంసీ ఖండించింది. దాడి రోజు బీజేపీ మండల అధ్యక్షుడు అభిజిత్ బిస్వాస్ సంఘటనా స్థలంలో ఉన్నారని, అతనే ప్రజల్ని రెచ్చగొట్టారని టీఎంసీ ఒక ఫోటోను రిలీజ్ చేసింది. దాడి చేసిన వారిలో ఒకరిని ఆకాష్ గాయన్గా గుర్తించారు, అతను బీజేపీ కార్యకర్త అని టీఎంసీ ఆరోపించింది. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ చెబుతోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!