NTV Telugu Site icon

Satyendar Jain: ఆప్ మంత్రి భోగాలు ఆహా.. జైలులోనే మసాజ్‌లు.. వీడియో వైరల్

Satyendar Jain

Satyendar Jain

AAP’s Satyendar Jain caught on cam getting massage in Tihar jail: ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో ఇరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ సత్యేందర్ జైన్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ.. మసాజ్ చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. మంత్రికి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఇటీవల తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. అయితే తీహార్ జైలు వర్గాలు ఈ వీడియో పాతదిగా చెబుతున్నారు.

Read Also: Konda Vishweshwar Reddy: మా అబ్బాయి పెళ్ళికి రండి.. మోడీకి ఇన్విటేషన్

ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆరోపించింది. మంత్రి విలాసాలకు సంబంధించిన ఆధారాలను గతంలోొ ఈడీ కోర్టుకు సమర్పించింది. కొంత మంది తెలియనవ్యక్తులు జైలు సమయం అయిపోయినా.. సత్యేందర్ జైన్ కు మసాజ్ చేసినట్లు, ప్రత్యేకంగా ఆహారం అందిస్తున్నట్లు ఈడీ తరుపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. కొన్ని సీసీ కెమరా వీడియోలు చూపించి.. సత్యేందర్ జైన్ జైలులో ఎక్కువ సమయం వివిధ విలాసాలు అనుభవిస్తున్నాంటూ కోర్టుకు వెల్లడించారు.

తాజాగా సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ ఆప్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేత షెహజాద్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘‘జైలులో వీవీఐపీ ట్రీట్మెంట్.. అలాంటి మంత్రిని కేజ్రీవాల్ సమర్థించగరా..? ఆయన్ను బర్తరఫ్ చేయకూడదా..? ఇది ఆప్ నిజ స్వరూపం.’’ అంటూ ట్వీట్ చేశారు. జైన్‌కు ప్రత్యేక చికిత్స అందించారనే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో కొట్టివేసింది, అవి అసంబద్ధమైనవి, నిరాధారమైనవిగా పేర్కొంది.