Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం
- రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- 106 నుంచి 113కు చేరిన బీజేపీ బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హర్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 106 నుంచి 113కు చేరుకుంది. అదే సమయంలో ఆప్ ఎంపీల సంఖ్య 3కు పడిపోయింది.

Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
గత శుక్రవారం ఆప్ ఎంపీలు ఊహించని షాకిచ్చారు. ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇక రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కలిశారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ స్వీట్లు తినిపించారు.
ఎంపీల ఫిరాయింపుపై ఆప్ నేత సంజయ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏడుగురు ఎంపీలు నిష్క్రమించడం చట్టవిరుద్ధమని ప్రకటించారు. రాఘవ్ చద్దాతో సహా ఆ ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాఘవ్ చద్దాను ‘‘ద్రోహి’’ అని పిలుస్తూ తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా పంజాబ్ ద్రోహులు అంటూ ఎంపీల పోస్టర్లు వేశారు.

MPs Raghav Chadha, Ashok Kumar Mittal, Harbhajan Singh, Sandeep Kumar Pathak, Dr. Vikramjit Singh Sahney, Swati Maliwal and Rajinder Gupta, who quit AAP to join BJP on 24th April, are now listed among the 113 Rajya Sabha MPs of BJP pic.twitter.com/Etof1vbb5g
— ANI (@ANI) April 27, 2026
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!