Site icon NTV Telugu

AAP MLA Honey Trap: ఆప్‌ ఎమ్మెల్యేకు హనీ ట్రాప్.. బీజేపీ పనే..!

Somnath Bharti

Somnath Bharti

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తనపై హనీట్రాప్ జరిగిందని చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, తమ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తోన్న క్రమంలో, హనీట్రాప్ వ్యవహారం దుమారం రేపుతోంది. తనను హనీట్రాప్ చేసేందుకు ఎవరో కుట్ర చేశారంటూ, వాట్సాప్ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను, ట్విట్టర్ లో షేర్ చేశారు అంటున్నారు సోమ్ నాథ్ భారతి.. అంజలి పేరుతో ఓ మహిళ ఛాటింగ్, స్క్రీన్ షాట్లలో కనపడుతోంది. ఇదివరకెప్పుడు ఇలాంటి హనీట్రాప్ లు తనపై జరగలేదన్న సోమ్ నాథ్, ఢిల్లీ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. హనీట్రాప్ పై బీజేపీ మీద తనకు అనుమానాలున్నాయని చెప్పారు సోమ్ నాథ్ భార్తి. హనీట్రాప్ కు సంబంధించిన ఆయన బయటపెట్టిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version