పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది… సీఎం, మాసీ సీఎంలు, సీనియర్ నేతలు, కీలక నేతలు ఇలా తేడా లేకుండా ఉడ్చేసింది ఆప్.. అందులో ముఖ్యంగా సీఎం చరణ్జిత్ చన్నీపై విజయం సాధించిన ఓ సాధారణ పౌరుడు వార్తల్లో నిలిచాడు.. మొబైల్ రిపేర్ షాపు నడుపుకునే లాభ్ సింగ్.. చన్నీకి ఓటమి రుచిచూపించాడు.. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన లాభ్ సింగ్ తల్లి మాత్రం.. తన ఉద్యోగం వదిలేది లేదంటున్నారు.. కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం స్వీపర్ ఉద్యోగం వదులుకునేందుకు నిరాకరిస్తున్నారు.. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ స్వీపర్గా పని చేస్తున్న ఆమె.. ఎన్నికల ఫలితాలు వెలవడి.. తన కుమారుడు విజయం సాధించిన తర్వాత కూడా డ్యూటీకి వెళ్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Read Also: Narayana Swamy: చంద్రబాబు చాలించు నీ కపట నాటకాలు..!
కాగా, తాజాగా వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చన్నీపై 37,558 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు లాభ్ సింగ్.. ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి అతను.. తండ్రి డ్రైవర్, తల్లి స్వీపర్‌గా పనిచేస్తున్నారు.. 1987లో జన్మించిన లాభ్ సింగ్.. 12వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు.. ఇక, మొబైల్ రిపేర్ షాప్ నడుపుతూ.. మొబైల్ రిపేర్లతో జీవనం గడిపే లాభ్ సింగ్.. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. బదౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం గ్రామాలను చుట్టేశాడు.. సమస్యలపై అధ్యయనం చేశాడు.. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఓటర్లను ఆకట్టుకున్నాడు.. అయితే, గత ఎన్నికల్లో గెలిచిన ఆప్ అభ్యర్థి పార్టీని వీడడం లాభ్ సింగ్‌కు లాభం చేకూర్చింది.. 2017 బదౌర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో ఆప్ టికెట్ను లాభ్ సింగ్కు వచ్చింది.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న లాభ్ సింగ్.. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడంతో.. ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ.. ఓటర్లను ఆకట్టుకున్నాడు.. సీఎంనే ఓడించి సంచలనంగా మారాడు. కానీ, తాను స్వీపర్ ఉద్యోగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తల్లి బల్దేవ్ కౌర్ చెబుతున్నారు.. నా కొడుకు గెలిచిన తర్వాత నేను పనికి రానని అంతా అనుకున్నారు.. కానీ, నా కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు.. నేను కాదు కదా..? అని ప్రశ్నించిన ఆమె.. నేను నా ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలి అని ఎదురుప్రశ్నించారు. అయితే, బల్దేవ్ కౌర్ గత 22 ఏళ్లుగా బర్నాలా జిల్లాలోని ఉగోకే గ్రామ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు.
