Site icon NTV Telugu

Aap MLA Arrest: ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ అరెస్టు

Amanatullah Khan

Amanatullah Khan

Aap MLA Arrest: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ అమానతుల్లా ఖాన్‌ను శుక్రవారం ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే, ఆయన సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించింది. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఉద్యోగాల భర్తీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వక్ఫ్‌ బోర్డుకు సంబంధించి రెండేళ్లనాటి అవినీతి కేసులో ఓక్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు చెందిన పలు ప్రాంతాల్లో ఏసీబీ శుక్రవారం సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో రూ.24 లక్షల నగదు, రెండు లైసెన్సు లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Nora Fatehi: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నటి నోరా ఫతేహికి క్లీన్‌చిట్‌

ఢిల్లీ వక్ఫ్‌బోర్డు ఉద్యోగ నియామకాల్లో అమానతుల్లా ఖాన్‌ అక్రమాలకు పాల్పడ్డారని, తన సన్నిహితులకు కొలువులిచ్చారన్న ఆరోపణలపై ఏసీబీ విచారిస్తోంది. ఇందులో భాగంగానే సోదాలు చేసి, అదుపులోకి తీసుకుంది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌, అతని వ్యాపార భాగస్వామి హమీద్‌ అలీఖాన్‌ మసూద్‌ ఉస్మాన్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Exit mobile version