Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
- అమిర్ ఖాన్ హిందువును పెళ్లి చేసుకోవడంపై ముస్లిం మతగురువు అభ్యంతరం.
- షరియా చట్టానికి విరుద్ధమని మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ వ్యాఖ్యలు.
- అమిర్ ఖాన్ మూడో వివాహంపై మళ్లీ రాజకీయ, మతపరమైన చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమిర్ ఖాన్ ఇటీవల తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇది అతడికి మూడో వివాహం. ఈ వివాహంపై ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల నుంచి మత నాయకుల వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, అమిర్ పెళ్లిపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా రాయల్ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇస్లాంలో ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం అనుమతించబడదని, అలా చేసిన వారు షరియా చట్టం ప్రకారం దోషులుగా పరిగణించబడతారని మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ పేర్కొన్నారు. ముస్లిమేతర స్త్రీని వివాహం చేసుకోవడం షరియా చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఇస్లాం బోధనలు, షరియా చట్టానికి విరుద్ధంగా ఉంటాయని చెప్పారు. ఇది ఇస్లాం ప్రతిష్టను దెబ్బతీస్తాయని, సమాజానికి ప్రతికూల సందేశాన్ని పంపుతాయని అన్నారు. ముస్లింలంతా మత బోధనల్ని గౌరవించాలని, ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read
- RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
- India-Iran: హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
- Hafiz Saeed: పహల్గామ్ ఉగ్రదాడి.. హఫీజ్ సయీద్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్..
- Weather News: ఎండా, ఉక్కపోత, చికాకు.. తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదా?
దీనికి ముందు మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా అమీర్ ఖాన్ జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన లవ్ జిహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమీర్ ఖాన్ దీనికి ముందు 1986లో రీనా దత్తాను తొలిసారిగా వివాహం చేసుకున్నారు. వారు చాలా సంవత్సరాలు కలిసి ఉన్నారు, కానీ 2002లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ 2005లో చిత్ర దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్‌పై ముస్లిం మతగురువు ఆగ్రహం
-
AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
-
Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
-
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!