Aaftab chopped live-in partner Shraddhar’s hands first after murder, reveals narco test: శ్రద్ధావాకర్ హత్య కేసులో ఒళ్లుగగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాను హత్య చేసిన విధానం చూస్తే అఫ్తాబ్ ఎంత క్రూరంగా వ్యవహరించాడో తెలుస్తోంది. తాజాగా జరిగిన నార్కో ఎనాలిసిస్ టెస్టులో పలు విషయాలును వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా శరీరాన్ని కట్ చేసేందుకు చైనీస్ కత్తిని ఉపయోగించినట్లు తేలింది. ముందుగా శరీరం నుంచి చేతులు నరికేసిన అఫ్తాబ్ ఆ తరువాత ఒక్కొక్క అవయవాన్ని శరీరం నుంచి వేరు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా గొంతు కోసి, తర్వాత చేతులు నరికేశాడు అఫ్తాబ్. ఆ తర్వాత శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో దాచాడు. ఇప్పటికే పోలీసుల అఫ్తాబ్ ఫ్లాట్ నుంచి శ్రద్ధాను హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: BSF Raising Day: బీఎస్ఎఫ్ ఇచ్చిన స్వీట్లను నిరాకరించిన పాకిస్తాన్ జవాన్లు..
శ్రద్ధాను నరికిన ఆయుధాన్ని ఎక్కడ పడేశాడనే విషయాన్ని అఫ్తాబ్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రదేశంలో వెతుకుతున్నారు. గురువారం ఢిల్లీలోని రోహిణిలోని ఓ ఆస్పత్రిలో అఫ్తాబ్ కు నార్కో అనాలిసిస్ టెస్టు పూర్తయింది. ఇదిలా ఉంటే శ్రద్ధా హత్యకు ముందే అఫ్తాబ్ కత్తులను కొనుగోలు చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అఫ్తాబ్, శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మొబైల్ ఫోన్ ను నెల రోజుల పాటు తన వద్దే ఉంచుకున్నాడు. ఆ తరువాత సముద్రంలో పడేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మే 18న శ్రద్ధా హత్య జరిగితే.. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ ను పోలీసులు నవంబర్ 12న అరెస్ట్ చేసి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి పంపారు. నవంబర్ 17న ఐదు రోజులు పొడగించారు. నవంబర్ 26న 13 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ విషయాల సాక్ష్యాల సేకరణలో పోలీసులు పాలిగ్రాఫ్, నార్కో ఎనాలిసిస్ టెస్టులు నిర్వహించారు.