West Bengal: టీఎంసీ ఆఫీస్‌లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- టీఎంసీ ఆఫీసులో వందలాది ఆధార్ కార్డులు, కీలక డాక్యుమెంట్లు..
- ఆధార్ కార్డులు తమవే అని చెబుతున్న స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతిపై ఫోకస్ చేసింది. మమతా బెనర్జీ పాలన సమయంలో అక్రమాలకు పాల్పడిన వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. అక్రమ వసూళ్లు, ఆక్రమణలపై సీఎం సువేందు అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉంటే, టీఎంసీ కార్యాలయంలో వందలాది ఆధార్ కార్డులు లభించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కొల్కతా లోని సాల్ట్ లేక్ టీఎంసీ కార్యాయలం నుంచి ఈ ఆధార్ కార్డులతో పాటు కీలక డాక్యుమెంట్లను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు బయటపడటంతో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.
టీఎంసీ కార్యాలయంలో లభించిన ఆధార్ కార్డులు తమవే అని స్థానికులు చెబుతున్నారు. ఆధార్ కార్డులు చేయించుకునే సమయంలో టీఎంసీ ఆఫీస్ అడ్రస్ ఇచ్చే వాళ్లమని వెల్లడించారు. ఆధార్ కార్డులు అడిగినప్పుడు టీఎంసీ కార్యకర్తలు ఇంకా రాలేదని చెబుతుండేవారని తెలిపారు. మే4వ తేదీన స్థానిక నివాసితులు పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. తాజాగా ఆఫీస్‌ను ఓపెన్ చేసిన చూడగా ఆధార్ కార్డులు లభ్యమయ్యాయి. టీఎంసీ కార్యాలయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు బయటపడటం స్థానికంగా సంచలనంగా మారింది. ఇదే కాకుండా ప్రభుత్వ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి పత్రాలను కూడా బయటపడ్డాయి.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!