NTV Telugu Site icon

Aadhaar card update: మీ ఆధార్‌ కార్డుకు పదేళ్లు నిండాయా? వెంటనే ఈ పని చేయాల్సిందే..!

Aadhaar

Aadhaar

ఆధార్‌ కార్డు వచ్చిన తొలినాళ్లలో ఎన్నో ఆందోళనలు.. ఏం జరిగిపోతుందోననే భయం.. తమ వివరాలు ఎవరి చేతిలో పడతాయోననే టెన్షన్‌.. అయితే, అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి కాదని చెబుతున్నా.. ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ కార్డును తప్పనిసరిగా అడుగుతున్నారు.. స్కూల్‌కు వెళ్లినా.. కాలేజీలో చేరినా.. ఉద్యోగంలో చేరినా.. బ్యాంక్ ఖాతా తెరవడం, సిమ్ దరఖాస్తు చేయడం, గ్యాస్ కనెక్షన్ వరకు ఆధార్ అత్యంత ప్రాధాన్య పత్రం. ఈ ప్రోగ్రామ్‌లు మరియు సేవల ప్రయోజనాన్ని పొందడానికి, ఆధార్ ప్రామాణీకరణ మరియు ధృవీకరణతో సంక్లిష్టతలను నివారించడానికి సాధారణ ప్రజలు తమ ఆధార్ డేటాను తాజా వ్యక్తిగత సమాచారంతో అప్‌డేట్ చేయాలి.. ఆధార్‌ పొంది పదేళ్లు దాటిన వారు.. గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సూచించింది. గత పదేళ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్ చేయనివారు వెంటనే ఈ పని చేయాలని సూచించింది.

Read Also: Ambati Rambabu: పవన్‌ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో స్పష్టత ఉందా..?

అయితే, ఈ అప్‌డేట్‌కు ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది యూఐడీఏఐ.. ఈ ప్రక్రియను మై ఆధార్‌ పోర్టల్‌తోపాటు దగ్గరలోని ఆధార్‌ సెంటర్‌లో నిర్దేశిత రుసుము చెల్లించి చేసుకోవచ్చని ప్రకటించింది.. దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్ కార్డులను జారీ చేస్తూ వస్తోంది భారత ప్రభుత్వం.. ఐరిస్​, వేలిముద్రలు, ఫొటోలను ప్రామాణికంగా తీసుకుని.. ఆధార్‌ను జారీ చేస్తుంది.. ఇలా కేటాయించిన ఆధార్‌ నంబర్‌ను వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా.. ప్రతీ అంశంలోనూ ఉపయోగిస్తున్నారు.. దేశంలో ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగినవారు 93 శాతం కంటే ఎక్కువే దేశంలో ఉన్నారు.. ఇక, దేశవ్యాప్తంగా దాదాపు 50,000 ఆధార్​ అప్​డేట్​ కేంద్రాలు పనిచేస్తున్నాయి..

యూఐడీఏఐ తాజా ప్రకటనను పరిశీలిస్తే.. పదేళ్ల క్రితం ఆధార్​ తీసుకుని, అప్పటి నుంచి తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదా.. మీరు వెంటనే డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించాలని కోరుతున్నాం. గుర్తింపు పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు… దీనిని మై ఆధార్​ పోర్టల్​ లేదా దగ్గరలోని ఆధార్ కేంద్రం నుంచి ఈ పని పూర్తి చేసుకోవచ్చు అని ప్రకటనలో పేర్కొంది యూఐడీఏఐ. మరోవైపు.. ఆధార్ కార్డుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.. ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై విచారణ జరిపిన సుప్రీం.. వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.. ఇక, చిన్నారులకు.. తల్లి వేలిముద్రలతో జారీ చేసిన ఆధార్‌ను కూడా అప్‌డేట్‌ చేసుకోవాల్సిన విషయం తెలిసిందే.. ఇప్పుడు యూఐడీఏఐ ఆదేశాలతో ప్రతీ పదేళ్లకు ఆధార్‌ కార్డ్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందన్నమాట.