Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News A Trap Is Being Set For Pakistani Spy Jyoti Malhotra Questions Are Pouring In On Pak Links

Jyoti Malhotra: ‘‘పాక్ గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఐబీ, ఎన్ఐఏ ప్రశ్నల వర్షం..

Published Date :May 20, 2025 , 8:02 pm
By Venu Goapl Reddy
  • యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బిగుస్తున్న ఉచ్చు..
  • ఐబీ, ఎన్ఐఏ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణ..
  • పాకిస్తాన్ లింకులు, ఆర్థిక సాయంపై ప్రశ్నల వర్షం..
Jyoti Malhotra: ‘‘పాక్ గూఢచారి’’ జ్యోతి మల్హోత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఐబీ, ఎన్ఐఏ ప్రశ్నల వర్షం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉచ్చు బిగుస్తోంది. పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేసిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), సైనిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఆమెను తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. పాకిస్తా్న్‌తో ఉన్న లింకులు, పాకిస్తాన్ పర్యటనల్లో ఎవరెవరిని కలిశారు..? అని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. మే 16న హిసార్‌లోని జ్యోతిని రెస్ట్ చేశారు. ఈమెపై ‘‘అధికారిక రహస్యాల చట్టం’’, బినామీ లావాదేవీల(నిషేధం) చట్టం కింద కేసులు నమోదు చేశారు. జ్యోతి అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేస్తున్న మరో 11 మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు.

ఐదు రోజుల పోలీస్ కస్టడీలో, మంగళవారం నాలుగో రోజు కూడా విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. హర్యానా పోలీస్, ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు పలు దఫాలుగా విచారణ జరిపారు. అయితే, జ్యోతి మాత్రం వారికి సహకరించడానికి నిరాకరించినట్లు సమాచారం. 2023 పాకిస్తాన్ సందర్శనలో ఎవర్ని కలిశారు..? హర్కిరత్ సింగ్ అనే వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడా..? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Murshidabad Violence Report: హిందువులు టార్గెట్‌, సహాయం చేయని పోలీసులు.. ముర్షిదాబాద్ వక్ఫ్ అల్లర్లు..

ఎహ్సాన్ దార్ అలియాస్ డానిష్‌తో పరిచయంపై అధికారులు విచారిస్తున్నారు. జ్యోతి పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న డానిష్‌‌ని ఎప్పుడు కలిశారు.? 2023 వీసా నిరాకరించడానికి ముందు లేదా తర్వాత జరిగిందా..? అని ఆరా తీస్తున్నారు. భారత్ డానిష్ అనే రాయబార కార్యాలయం నుంచి బహిష్కరించిన తర్వాత అతడితో సంబంధాలు కొనసాగించిందా..? అని తెలుసుకోవాలని విచారణ అధికారులు భావిస్తున్నారు. డానిష్ లేదా ఇతర పాక్ వ్యక్తులు వీసా సహాయం, నిధులు, కంటెంట్ ఐడియాలు లేదా ఇంకా ఏదైదా మద్దతు ఇచ్చారా..? లేదా ఏదైనా ప్రభావం ఈమెపై ఉందా అని పరిశీలిస్తున్నారు.

జ్యోతి 2024లో తన వీసాను ఒక నెల ఎందుకు పొడగించింది, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉండే ఆమె వీడియోలు, మెసేజ్‌లను ఎవరైనా డైరెక్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత భద్రతా దళాలను నిందిస్తూ ఆమె చేసిన వీడియోపై అధికారులు వివరణను కోరుతున్నారు. పాకిస్తాన్‌లో డానిష్‌తో పాటు ఆమె ఎవరెవర్ని కలిసింది అనేదానిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమె జరిపిన ఎన్‌క్రిప్టెడ్ చాట్స్‌ని పరిశీలిస్తున్నారు. చైనా, దుబాయ్, బంగ్లాదేశ్, భూటాన్‌కు ఆమె ప్రయాణాలు, అందుకు ఎవరైనా ఆర్థిక, లాజిస్టిక్ సహాయం చేశారా.? అని ప్రశ్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ESPINOGE
  • Jyoti Malhotra
  • Jyoti Malhotra Pakistan link
  • Jyoti Malhotra spy for Pakistan"
  • Official Secrets Act

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions