Cruel Mother: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా పలు ఆవిష్కరణలు జరిగాయి. మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్సు పరిష్కారం చూపుతుంది. సైన్స్ వాస్తవంపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకం ఆధారంగా నడుస్తోంది. ఈ రోజుల్లో మూఢనమ్మకాలేంటి అనుకుంటామా.. ప్రజలు మాత్రం వాటిని వదలట్లేదు. వారసత్వ సంపదలా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రభావం అప్పుడే పుట్టిన పిల్లలపై చూపుతున్నారు తల్లిదండ్రులు. శిశువులపై చూపడమే కాదు మూఢనమ్మకాలతో వారిపై ప్రయోగాలు కూడా చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కొంతమంది ఒకమెట్టు పైకి ఎక్కి పుట్టిన బిడ్డ గురించి ఆలోచించడం మంచిదే కానీ..మూఢనమ్మకాలకు పోయి బిడ్డ వేళ్లను కాగే నూనెలో పెట్టిన వైనం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా ఫతేపూర్ లో చోటుచేసుకుంది.
Read also: Assam Floods: అస్సాంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరదలు.. నిరాశ్రయులైన 34 వేల మంది
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా ఫతేపూర్ ప్రాంతంలోని ఇస్రౌలీ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఫతేపూర్ ఆరోగ్య కేంద్రంలో నిండు మగబిడ్డ జన్మించాడు. మొదటి 3-4 రోజులు ఆరోగ్యంగా ఉన్న చిన్నారి.. ఆ తర్వాత తల్లి పాలు తాగలేదు. దీంతో ఆసియా తీవ్ర ఆందోళనకు గురైంది. ఏం చేయాలో తోచక, హాస్పిటల్ స్టాఫ్ కు ఆమె సలహా అడిగింది. దీంతో ఆ స్టాఫ్ ఓ సలహా ఇవ్వడంతో వెనక ముందు ఆలోచించకుండా సలహాలను పాటించింది. ఇంతకీ ఆసుపత్రి వారు ఏం సలహా ఇచ్చారో తెలుసా? పుట్టిన బిడ్డ వేళ్లను కాగే నూనెలో పెట్టాలని. ఇది విన్న మనమే ఆశ్చర్యపోతుంటే.. ఆ తల్లి ఒక్కసారి కూడా ఆలోచించకుండా కాగే నూనెలో ఆ పశికందు వెళ్లు పెట్టడంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది.
నైట్ డ్యూటీలో ఉన్న నర్సు దీన్ని గమనించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పాలు లేకపోవడంతో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆసియా.. ఆ భయంతోనే ఈ చర్యకు పాల్పడింది సమాచారం. అయితే ఇలాంటి ముఢనమ్మకాలు ఇప్పుడు కూడా నమ్మటం ఏంటిని పలువురు నెట్టిజన్లు ఫైర్ అవుతున్నారు. ఛీ నువ్వసలు తల్లివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Vizag MP Family Kidnap Case: కిడ్నాప్ కేసులో కీలక ట్విస్ట్.. ప్రియురాలికి రూ.40 లక్షలు