దేశ నేర చరిత్రలోనే అత్యంత హేయమైన సంఘటన మహరాష్ర్టలో ని బీడ్ జిల్లాలో తాజగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత పేదరికంలో నూ తన సొంత కాళ్లపై నిలబడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను ఆసరాగా తీసుకుని పరిచయమైన ప్రతివాడు ఆమెను చెరిచాడు. ఉద్యోగం ఇప్పించకపోగా శారీరక వాంఛను తీర్చుకునేందుకు చూశారు. కాగా పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడకూడా పోలీసులు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇవన్నీ బాలిక ఆరోపణలుకాగా, వరుస అత్యాచారాల కారణంగా గర్భం దాల్చిన బాలిక ఎటు దిక్కుతోచని స్థితిలో శిశు సంక్షేమ శాఖను ఆశ్రయిం చింది. అక్కడి అధికారుల సాయంతో బాలికతో అత్యాచార కేసు నమోదైంది.
సంచలనం రేకేత్తించిన ఈ సంఘటనపై బీడ్ జిల్లా ఎస్పీ ఆర్. రాజా మీడియాకు వివరాలను వెల్లడించారు. బీడ్ జిల్లా, అంబేజోగా తాలుకా లోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలికది నిరుపేద కుటుంబం. తల్లి దండ్రులిద్దరూ రోజుకూలీలు. ఉన్నంతలో ఆ బాలికను చదివించా రు. రెండేళ్ల కిందట అనారోగ్యంతో తల్లి చనిపోయింది. కూతుర్ని సాకలేని తండ్రి బాలిక వయస్సు ఆలోచించకుండా బాల్య వివాహం జరిపించాడు. చిన్నవయస్సులో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమెకు మామ నుంచి వేధింపులు మొదలయ్యాయి. భర్త సైతం తండ్రినే సమర్థించేవాడు. ఏడాదిన్నరపాటు అత్తింట్లో కష్టాలు పడ్డ బాలిక చివరకు నాన్న దగ్గరికి చేరుకుంది. ఖాళీగా ఉండటం ఇష్టం లేని బాలిక ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఆరు నెలల కిందట అంబేజోగై పట్టణానికి చేరుకుంది.
అంటేజోగైలో ఓ కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న ఇద్దరూ వ్యక్తులు బాలికకు పరిచయం అయ్యారు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ స్నేహితులు కొందరూ ఇదే సాకుతో ఆ బాలికను రేప్ చేశారు. ఇలా గడిచిన ఆరు నెలల వ్యవధిలో దాదాపు 400 మంది అత్యాచారం చేశారని ఆ బాధిత బాలిక చెబుతోంది. దీంతో న్యాయం చేయాలని బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల తరువాత కానీ అంబేజోగై పోలీస్ స్టేషన్‌లో బాధిత బాలిక ఫిర్యాదు నమోదు కాలే దు. అదే స్టేషన్‌కు చెందిన ఇద్దరూ కానిస్టేబుళ్లపై నా విచారణకు ఆదేశించినట్టు ఎస్పీ తెలిపారు. బాధిత బాలిక చెప్పిన ఆనవాళ్లను బట్టి ఇప్పటి వరకు తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు. వారిలో నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. గర్భంతో ఉన్న బాలి క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు అబార్షన్ చేయించేందుకు శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
