Site icon NTV Telugu

fighter Jet Crash: రాజస్థాన్‌లో కూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి

Fighter Jet Crash

Fighter Jet Crash

Fighter Jet Crash: భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది. కూలిన వెంటనే భారీ మంటల్లో చిక్కుకుని పైలట్లు మరణించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వైమానిక దళానికి చెందిన విమానం ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా మిగ్-21 విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version