తేలికపాటి వర్షం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఎండల నుండి ఉపశమనం పొందారు. వరుసగా ఆరు రోజులుగా తీవ్రమైన వేడిగాలుల తర్వాత.. శనివారం దేశ రాజధానిలో వాతావరణం కొద్దిగా మారిపోయింది. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం కాసేపు సూర్యరశ్మి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మళ్లీ ఆకాశం మేఘావృతమై ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో.. ఆరు రోజుల తర్వాత శనివారం వేడిగాలుల నుండి కొంత ఉపశమనం లభించింది.
Bike Thieves: పార్కింగ్ వాహనాలే టార్గెట్.. మాస్టర్ కీ సాయంతో దొంగతనం
ఇదిలా ఉంటే.. ఆదివారం నాడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ఠంగా 2.8 మి.మీ. దీంతో పాటు ఢిల్లీలోని పాలం, లోధి రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. ఒక రోజు ముందు.. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
SSMB29 : మహేష్ కి జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ..?
వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43 నుండి 44 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల హీట్ వేవ్ నుండి కొంత ఉపశమనం ఉండవచ్చు.. కానీ తీవ్రమైన వేడి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. మరోవైపు.. ఢిల్లీలో హీట్ ఇండెక్స్ 47గా ఉంది. వాతావరణంలో ధూళి ఎక్కువగా ఉండడంతో ఢిల్లీలో శనివారం గాలి సూచీ పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. వచ్చే మూడు రోజుల పాటు గాలి నాణ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది. CPCB విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఢిల్లీ ఎయిర్ ఇండెక్స్ 245 కేటగిరీలో ఉంది. ఒకరోజు క్రితం ఢిల్లీ ఎయిర్ ఇండెక్స్ మోడరేట్ కేటగిరీలో 190గా ఉంది.
