NTV Telugu Site icon

Tejashwi Yadav: మీకేమో ప్రేమ పెళ్లి.. నా పెళ్లికి నిరుద్యోగం అడ్డంకి.. యువతి లవ్ లెటర్ వైరల్

Tejashwi Yadav Letter

Tejashwi Yadav Letter

A Girl Wrote Letter To Tejashwi Yadav On Unemployment Going Viral: అప్పుడప్పుడు ప్రజలు తమ (నిరుద్యోగం, అభివృద్ధి విషయాలపై) సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరుతూ.. అధికారులకు లేఖలు రాస్తుంటారు. అందులో కొన్ని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంటాయి. ఎందుకంటే.. రొటీన్‌కి భిన్నంగా కొందరు తమ సమస్యల్ని వినూత్నంగా ఆ లేఖల్లో ప్రెజెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఓ యువతి సైతం తనకున్న నిరుద్యోగ సమస్యను ‘ప్రేమ’ లేఖ రూపంలో తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. మీరైతే ప్రేమ పెళ్లి చేసుకున్నారు కానీ.. నా పెళ్లికి మాత్రం నిరుద్యోగం అడ్డంకిగా మారిందంటూ బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు ఓ అమ్మాయి లేఖ రాసింది. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ ఎంపీ తనయుడు రాఘవ అరెస్ట్

ఆ లేఖలో తన పేరుని పింకీగా పేర్కొన్న ఆ యువతి.. తాను చాలాకాలం నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని పేర్కొంది. అయితే.. రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ లేకపోవడంతో ఉద్యోగం రాలేదని తన ఆవేదన వ్యక్తం చేసింది. తాను నాలుగు సంవత్సరాల నుంచి ప్రభాత్ అనే రచయితను ప్రేమిస్తున్నానని.. తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి తన ప్రేమ విషయాన్ని తెలియజేయాలనుకున్నానని.. కానీ ఉద్యోగం లేక తన కోరిక ఇప్పటికీ నెరవేరలేదని ఆ లేఖలో వాపోయింది. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడలేదని.. ఒకవేళ వచ్చినా పేపర్ లీక్ అవుతుండటంతో పరీక్షలు జరగడం లేదని అహసనం వ్యక్తం చేసింది. తనలాంటి వాళ్లు నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారని తన బాధను తెలియజేసింది.

Qamar Javed Bajwa: ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగితే, పాకిస్తానే ఉండేది కాదు

ఈ విధంగా పింకీ రాసిన లేఖ వైరల్ కావడంతో.. రచయిత ప్రభాత్ స్పందించారు. తనకు పింకీ ఎవరో తెలియదని, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని క్లారిటీ ఇచ్చారు. ఈ లేఖ విషయం తెలిసి తనపై భార్య కోపంగా ఉందని తెలిపారు. ఆ లేఖని బట్టి చూస్తే.. ప్రేమ అంశం కన్నా నిరుద్యోగం అనే అంశం ప్రధానంగా ఉందని, ఆమెకు కావాల్సింది ఉద్యోగం మాత్రమేనని, ప్రేమ కాదని తెలుస్తోందని అన్నారు. కేవలం ప్రచారం కోసమే తన పేరుని వాడుకున్నట్టుగా ఉందని ప్రభాత్ పేర్కొన్నారు. చూస్తుంటే.. ప్రభాత్ చెప్పింది నిజమేననిపిస్తోంది. నిరుద్యోగ సమస్యను లేవనెత్తేందుకే.. ఆ యువతి ‘ప్రేమ’ అనే అంశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.

Akash Chopra: ముందు మీ దేశంలో సిరీస్ గెలవండి: పాక్ ఫ్యాన్స్‌కు ఆకాశ్ చోప్రా పంచ్