Site icon NTV Telugu

Mysore Fire Accident: మైసూరులో భారీ అగ్నిప్రమాదం.. ఏకంగా రెండు కీలోమీటర్ల మేర..

Fire Broke Out In Hubli

Fire Broke Out In Hubli

A Fire Broke Out In A Firecracker Factory In Hubli Industrial Park: మైసూరులో ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించడంతో.. రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో.. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవ్వడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌లో ఒక ప్రైవేటు గోడౌన్ ఉంది. అందులో క్రాకరీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగడంతో.. అందరూ బతుకుజీవుడా అంటూ పరుగులు పెట్టారు. అది క్రాకరీ ఫ్యాక్టరీ కావడంతో.. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. బాణాసంచాలన్ని పేలడంతో.. మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి.. చుట్టుపక్కల ఉన్న 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ధాటికి రెండు కీలోమీటర్ల దూరం వరకు ప్రభావితం అయినట్లు తెలిసింది.

Mamata Banerjee: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. అమిత్ షాకు మమతా బెనర్జీ సవాల్

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే రంగంలోకి దిగారు. మంటల్ని అదుపు చేసేందుకు 14 అగ్నిమాపక యంత్రాల్ని తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ గోడౌన్‌లో ఎంతమంది పని చేస్తున్నారు? ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? సమీపంలోని భవనాల నుండి ఎంతమంది ప్రభావితమయ్యారు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భవనంలో చాలామంది పౌరులు చిక్కుకుని ఉంటారని ఆందోళన చెందుతున్నారు. ఈ మంటల్ని ఆర్పేందుకు కొన్ని గంటల సమయం పడుతుందని సమాచారం. దట్టమైన పొగల కారణంగా.. ప్రమాద ప్రాంతం చుట్టూ భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Angkita Dutta: ఆరు నెలల నుంచి వేధిస్తున్నాడు.. సొంత పార్టీ నేతపై సంచలన ఆరోపణలు

Exit mobile version