NTV Telugu Site icon

UP: రైతుకు సమీపంగా వచ్చిన పులి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Uptiger

Uptiger

క్రూర జంతువులను చూస్తే ఎవరైనా హడలెత్తిపోతారు. అది పులైనా.. సింహామైనా, ఏనుగు అయినా.. ఎలుగుబంటి అయినా భయపడతాం. అలాంటిది ఓ అన్నదాతకు సమీపంలోకి ఒక పెద్ద టైగర్ ఎదురుపడింది. ఈ హఠాత్తు పరిణామంతో రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Minister Parthasarathy: కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి.. వీటికి ఆమోదం..

చెరుకు తోటలో బైక్‌పై రైతు ఉండగా.. తోటలోంచి సడన్‌గా ఓ పులి ప్రత్యక్షమైంది. కేవలం కొన్ని అడుగుల దూరంలోనే పులి అటుఇటు తిరుగుతూ కనిపించింది. అయితే బైక్‌పై ఉన్న రైతు దగ్గర మరో వ్యక్తి నిలిచి ఉండి మొబైల్‌లో వీడియో తీస్తూ కనిపించాడు. ఒకానొక దశలో బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నారు. కానీ ఇద్దరు ఏ మాత్రం జడియకుండా అలానే చూస్తూ ఉన్నారు. పులి కూడా నీరసంగా ఉన్నట్లు కనిపించింది. కొద్ది సేపు అటుఇటు తిరిగి పడుకునిపోయింది. 42 సెకన్ల వీడియోను ఫారెస్ట్ సర్వీస్ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మాత్రం రైతు యొక్క ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. పులితో పరిచయం ఉన్నట్లు ఉంది.. అందుకే ఏమీ చేయలేదని ఒకరు రాసుకొచ్చారు. ఆ దృశ్యాలను మీరు కూడా చూసేయండి.