NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీని కలిసిన కాథలిక్ బిషప్స్ బృందం

Rkeke

Rkeke

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీని భారత కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక ప్రతినిధి బృందం కలిసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రతినిధి బృందంలో మోస్ట్ రెవ. ఆండ్రూస్ థాజత్, రెవ. జోసెఫ్ మార్ థామస్, మోస్ట్ రెవ. డాక్టర్ అనిల్ జోసెఫ్ థామస్ ఉన్నారు. కూటో మరియు రెవ. సజిమోన్ జోసెఫ్ కోయికల్ కలిసిన వారులో ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అలాగే 23న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్‌సభ స్పెషల్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయా అంశాలు లేవనెత్తారు.