Site icon NTV Telugu

Bangalore Pre School: క్లాస్ రూంలో చిన్నారిపై బాలుడి దాడి.. టీచర్లు ఎక్కడ..?

Bangalore Pre School

Bangalore Pre School

Bangalore Pre School: బెంగళూరులోని ఓ ప్రీ స్కూల్‌లో దారుణం జరిగింది. ఉపాధ్యాయురాలు తరగతి గది నుంచి బయటకు రాగానే ఓ బాలుడు మరో చిన్నారిపై దాడి చేశాడు. చేతులతో కొట్టడం, కాళ్లతో తన్నడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దాదాపు నాలుగైదు నిమిషాల పాటు చిన్నారిపై దాడి జరిగింది. బాలుడు చిన్నారిని
తల వంచిపిడుగుద్దులు కొట్టడంతో విలవిల లాడింది. గట్టిగా కేకలు వేస్తున్నా అక్కడ అంత మంది వున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. బాలుడు కొట్టడంతో చిన్నారి ఆ నొప్పులకు బోరున ఏడ్చింది. అక్కడే పిల్లలు ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. అయితే.. పిల్లల బాగోగులు చూడాల్సిన ఉపాధ్యాయులు, ఆయమ్మలు
లేకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, స్కూల్ యాజమాన్యంతో పాటు బాలుడి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తూర్పు బెంగళూరుకు చెందిన సిటిజన్స్ మూమెంట్ ట్విట్టర్ హ్యాండిల్ వీడియోను పోస్ట్ చేసి పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించింది.

Read also: KP Drugs Case: కేపీని మరోసారి కస్టడీకి తీసుకునే ఛాన్స్‌.. కాల్‌లిస్ట్‌లో వున్న వారికి నోటీసులు..?

మీ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించవద్దని సూచించిన ఘటన చిక్కలసంద్రలోని టెండర్ ఫుట్ స్కూల్ లో ఈఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చిన్నారుల తల్లిదండ్రులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక టీచర్ లేదా ఆమె టీచర్ తరగతి గది నుండి బయటకు వెళ్లినప్పుడు ఒక అబ్బాయి మరొక అమ్మాయిని కొట్టడం మరియు ఆమెను హింసించడం ప్రారంభించాడు. మధ్యలో తరగతి గదిలోని కిటికీలోంచి టీచర్ వైపు చూస్తూ చిన్నారిపై పలుమార్లు దాడి చేశాడు. చిన్నారి తన్నడం, మెడ కొరికేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో చూసి చిన్నారి తల్లి కన్నీరుమున్నీరైంది. పిల్లలను అలా వదిలేసిన యాజమాన్యంపై తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తలుపులు మూసి ఉన్న గదిలో పిల్లలను ఎలా వదిలేశారు? ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, స్కూల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Sikkireddy Mother: కేపీ చౌదరి మాకు తెలుసు.. కానీ ఎలాంటి వాడో మాకు తెలియదు

Exit mobile version