Site icon NTV Telugu

ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ 400 సంవత్సరాల గణపతి విగ్రహం

చెన్నై ఎయిర్ పోర్ట్ కార్గోలో 400 సంవత్సరాల పురాతన నృత్య గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి కోయంబత్తూర్ వెళుతున్న ఓ పార్శిల్ లో ఈ గణపతి విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా పురాతన విగ్రహాన్ని చెన్నై వయా కోయంబత్తూర్ మీదుగా విదేశాలకు తరలిస్తుండగా అధికారులు వారి పథకాన్ని భగ్నం చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్ లోని కార్గో పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కస్టమ్స్ అధికారుల బృందం తెలిపింది. ఓ పార్శిల్ స్కానింగ్ లో నృత్య గణపతి విగ్రహాన్ని గుర్తించడంతో సీజ్ చేసి దానిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ విగ్రహాన్ని చెన్నై కాంచీపురంలోని ఓ ఇంట్లో నుండి కోయంబత్తూర్ కు తరలిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version