Site icon NTV Telugu

900 Temples: 900 ఆలయాలు ఒక్క పర్వతంపైనే …. ప్రపంచ రికార్డు ఇండియాలోనే.

900 Temples

900 Temples

900 Temples: ఒక దగ్గర ఒక గుడి ఉంటుంది.. లేదంటే రెండు గుళ్లు ఉంటాయి.. ఇంకా అంటే మూడు గుళ్లు ఉంటాయి.. కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే దగ్గర ఉన్న ప్రాంతం ఎక్కడా చూశారా? అదేంటీ.. అటువంటి ఒక ప్రాంతం ఉందా? అనే అనుమానం కలుగుతుందా? ఇది నిజం.. ఒకే దగ్గర 900 గుళ్లు ఉన్నాయి. అదీ ఒక పర్వతంపై. ఒక్క పర్వతంపై ఏకంగా 900 ఆలయాలు ఉన్నాయి.. అది కూడా ఇండియాలోనే ఉంది. ఇండియాలోని గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. ఇవిగో వివరాలు.. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అనేక విషయాల్లో విభిన్నత కనిపిస్తుంది. జనం వివిధ నగరాల్లో కనిపించే వైవిధ్యానికి ఆకర్షితులవుతుంటారు. కొన్ని అంశాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిలో సముద్రాలు, పర్వతాలు, జలపాతాలు, నదులు మొదలైనవాటికి మనం ఎంతో ప్రాధాన్యతనిస్తుంటాం. ఒక పర్వతంపై ఏకంగా 900 ఆలయాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా.. ఈ పర్వతం భారతదేశంలోనే ఉంది. ఇది భక్తుల నమ్మకాలకు ప్రతీకగా నిలిచింది. దేశంలో అత్యధిక ఆలయాలు కలిగిన పర్వతం ఇదేకావడం విశేషం.

Read also: Rajasthan: 19 ఏళ్ల యువతి కిడ్నాప్, యాసిడ్ దాడి.. చివరకు మృతదేహాన్ని బావిలో పడేసి..

900 ఆలయాఉ ఉన్న మహాపర్వతంపేరు ‘శత్రుంజయ పర్వతం’. ఇది పాలీతానా శత్రుంజయ నది ఒడ్డున ఉంది. ఈ పర్వతంపై సుమారు 900 ఆలయాలు ఉన్నాయి. ఇన్ని ఆలయాలు ఉన్నకారణంగానే ఈ పర్వతం భక్తులకు ఆలవాలంగా మారింది. ప్రతీయేటా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఈ అద్భుత పర్వతం మన దేశంలోని గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. ఇది భావ్‌నగర్‌ జ్లిలాకు వెలుపల భావ్‌నగర్‌ పట్టణానికి 50 ​కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పర్వతంపై జైన తీర్థంకరుడు భగవాన్‌ రుషబ్‌దేవ్‌ ధ్యానం చేశాడని చెబుతారు. ఆయన ఇక్కడే తన తొలి ఉపదేశాన్ని ప్రవచించారట. ఈ పర్వతంపై గల ప్రధాన ఆలయం అత్యంత ఎత్తున ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 3 వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 24 తీర్థంకరులలోని 23 మంది తీర్థంకరులు ఈ పర్వతాన్ని సందర్శించారు. ఈ కారణంగా ఈ పర్వతానికి ఇంత మహత్తు ఏర్పడిందంటారు.

Read also: Health Tips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేయండి..

పర్వతంపై నిర్మితమైన ఆలయాలన్నీ పాలరాతితో నిర్మాణం చేయబడ్డాయి. ఈ ఆలయాల నిర్మాణం 11వ శతాబ్ధంలో జరిగింది. ఈ ఆలయాలలో పలు కళాకృతులు కనిపిస్తాయి. సూర్యకిరణాలు పడినంతనే ఈ ఆలయం శోభాయమానంగా వెలిగిపోతుంటుంది. అలాగే చంద్రుని వెలుగులోనూ ఆలయాలు తళుకులీనుతాయి. ప్రపంచంలోని ఏకైక శాకాహార నగరంగా గుర్తింపు పొందిన పాలీతానాలో ఈ పర్వతం ఉంది. ఈ నగరం శాకాహారులకు చెందినదిగా పేరు గడించింది. ఇక్కడివారెవరూ మాసం ముట్టరు. ఈ లక్షణమే ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.

Exit mobile version