NTV Telugu Site icon

Turtle meat: సముద్ర తాబేలు మాంసం తిని 9 మంది మృతి.. 78 మందికి తీవ్ర అస్వస్థత..

Turtle Meat

Turtle Meat

Turtle meat: ఆఫ్రికాలోని జాంజిబార్‌‌లో విషాదం నెలకొంది. ఆ ప్రాంతంలో అత్యంత రుచికరమైనందిగా భావించే, ప్రజలు ఇష్టంగా తినే తాబేలు మాంసం 9 మంది ప్రాణాలు తీసింది. జాంజిబార్ ద్వీప సమూహంలోని పెంబా ద్వీపంలో సముద్ర తాబేలు మాంసం తినడంతో ఈ మరణాలు సంభవించాయి. మరో 78 మంది ఆస్పత్రి పాలైనట్లు అధికారులు శనివారం తెలిపారు.

Read Also: UN Security Council: 25 ఏళ్లు గడిచాయి. ఇంకెత కాలం..? భద్రతా మండలి సంస్కరణపై భారత్ హెచ్చరిక..

సముద్రం తాబేలు మాంసం జాంబిజార్ ప్రజలకు ఇష్టమైన ఆహారం. అయితే దీంట్లో ఉండే చెలోనిటాక్సిజం అనే విషం కొన్ని సందర్భాల్లో మరణాలకు దారి తీస్తుంది. మంగళవారం తాబేలు మాంసం తినడంతో అక్కడి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నారని ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయి.

తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజిబార్‌లోని అధికారులు హమ్జా హసన్ జుమా నేతృత్వంలోని విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు. ప్రజలు సముద్ర తాబేలు మాంసం తినొద్దని ప్రజలను కోరారు. నవంబర్ 2021లో కూడా జాంజిబార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. సముద్ర తాబేలు మాంసం తిని పెంబాలో 3 ఏళ్ల బాలుడితో సహా ఏడుగురు మరణించారు. ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.