NTV Telugu Site icon

దేశంలో ప్రస్తుతం ఎన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయో తెలుసా? 

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు.  వ్యాక్సిన్‌ను పెద్ద‌లంద‌రికి అందించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  అయితే, ప్ర‌స్తుతం అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొర‌త‌ను ఎదుర్కొంటున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్య‌శాఖ లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రాల వ‌ద్ద ప్ర‌స్తుతం 88 ల‌క్ష‌ల టీకాలు ఉన్నాయిని, మ‌రో మూడు రోజుల్లో 28 ల‌క్ష‌ల టీకాల‌ను రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అంద‌జేస్తామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  మే 1 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే.