Site icon NTV Telugu

ఫ‌లించిన భార‌త్ ఒత్తిడిః కోవీషీల్డ్‌కు ఈయూ అంగీకారం…

ప్ర‌యాణికుల కోసం ఈయూ గ్రీన్ పాస్ విధానాన్ని అమ‌లులోకి తీసుకొచ్చింది.  వివిధ దేశాల ప్ర‌యాణికులు ఈయూదేశాల్లో ప్ర‌యాణం చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అమ‌లులోకి తీసుకొచ్చింది.  క‌రోనా మ‌హ‌మ్మారి నేస‌థ్యంలో టీకా తీసుకున్న వారికి ఈ విధానం వ‌ర్తిస్తుంది.  అయితే, నాలుగు రకాల టీకాలు తీసుకున్న వారికి మాత్ర‌మే ఈ గ్రీన్ పాస్‌లు వ‌ర్తిస్తాయ‌ని మొద‌ట పేర్కొన్న‌ది.  మోడెర్నా, ఫైజ‌ర్‌, అస్త్రాజెన‌కా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ టీకాల‌కు మాత్ర‌మే గ్రీన్ పాస్ లు ఇస్తామ‌ని తెలిపింది.  

Read: మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటే…

దీంతో ఇండియాలో త‌యారైన కోవీషీల్డ్ తీసుకున్న వారు ఈయూ దేశాల్లో అనుమ‌తిస్తారా లేదా అనే సందేహాలు మొద‌ల‌య్యాయి.  దీంతో ఇండియా ఈయూ స‌మాఖ్య‌పైన‌, స‌భ్య‌దేశాల‌నైన దౌత్య‌ప‌ర‌మైన ఒత్తిడి తీసుకొచ్చింది.  దౌత్య‌ప‌ర‌మైన ఒత్తిడితో యూర‌ప్‌లోని 8 దేశాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్ర‌యాణం చేసేందుకు అనుమ‌తులు ఇచ్చాయి.  ఆస్ట్రియా, జ‌ర్మ‌నీ, స్లోవేనియా, గ్రీస్‌, ఐస్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, ఎస్టోనియా దేశాలు కోవీషీల్డ్ తీసుకున్న వారికి ప్ర‌యాణాలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపాయి. 

Exit mobile version