మహా కుంభమేళాలో మరో ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి కుంభమేళాకు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి.. బస్సుపైకి దూసుకెళ్లడంతో 8 మంది భక్తులు మృతిచెందారు. జైపూర్ నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్‌లోని మోఖంపుర సమీపంలోని జాతీయ రహదారి 48పై ఈ ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయింది. కారు డివైడర్‌ను దూకి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. కారు నుజ్జునుజ్జు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Laila : బూతే బూతు కానీ నవ్వుల ట్రీట్.. లైలా ట్రైలర్ చూశారా?
ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. అనంతరం అగ్నిప్రమాదం సంభవించి టెంట్లు కాలిపోయాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.
ఇది కూడా చదవండి: AP Ministers Ranks: ఆరో స్థానంలో చంద్రబాబు.. పదో స్థానంలో పవన్ కల్యాణ్..