Site icon NTV Telugu

Bihar: నీటి గుంత‌లో ప‌డిన కారు.. మృత్యుఒడిలోకి 8 మంది

Car

Car

బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. నీటి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును వెలికి తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంగా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి హాజరయ్యారని, కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారును వేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.

కాగా.. ఒడియాలోని నయాగఢ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌.. పారదీప్‌ నుంచి నయాగఢ్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో నయాగఢ్‌ జిల్లాలోని ఇటామటి వద్ద ఉన్న పండుసురా వంతెన వద్ద నదిలో పడిపోయింది.

ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ట్యాంకర్‌లో ఉన్న నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కటక్‌ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: భాగ్యనగరంలో బోనాల సందడి షురూ

Exit mobile version