NTV Telugu Site icon

Viral Video: గంగానదిలో దూకిన 70 ఏళ్ల ముసలామె.. ఆశ్చర్యంలో నెటిజన్లు

Old Woman Jumps Into Ganga River

Old Woman Jumps Into Ganga River

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. హర్‌ కీ పౌరీ బ్రిడ్జి దగ్గర గంగానదిలో వందల మంది భక్తులు ప్రతిరోజు స్నానాలు ఆచరించడం సాధారణం. అక్కడ గల ఘాట్‌లో మూడు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. కానీ అక్కడ ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. అసలు 70 ఏళ్ల ముసలి వాళ్లు అంటే ఎలా ఉంటారు. కృష్ణారామ అంటూ జపాలు చేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఓ ముసలామె ఏకంగా గంగానదిలో సాహసం చేయాలనుకుంది. అక్కడ ఉన్నవారు అలా చేయొద్దు అని చెప్పడం వదిలేసి అదిగో అక్కడ దూకండి అంటూ ప్రోత్సహించారు.

ఆ ముసలామె తనను ఎవరైనా ఆపేస్తారేమో అన్నట్లుగా హడావిడిగా వారు చెప్పిన ప్రదేశంలో దూకింది. అనంతరం ఘాట్‌వైపు ఈతకొడుతూ వెళ్లింది. ఈ వీడియోను సర్వోన్నత న్యాయస్థానంలో చత్తీస్‌గఢ్ తరఫున అడ్వొకేట్ జనరల్‌గా పని చేస్తున్న అశోక్ బసోయా ఈ వీడియోను షేర్ చేశారు. అనంతరం అదే వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా కూడా షేర్ చేశారు.

“వీడియో చూసి, నేను మొదట షాక్ అయ్యాను, కాని బామ్మ ఈతలో నిష్ణాతురాలిగా మారిపోయింది. ఆమె వయస్సు దాదాపు 70 సంవత్సరాలు. హర్ కీ పౌరి వంతెనపై నుంచి గంగానదిలోకి దూకి ఈతకు వెళ్లిన ఆమె ధైర్యం, ఉత్సాహం నమ్మశక్యం కాదు. నిజంగా వయసు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఆపదు” అంటూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విటర్‌లో వెల్లడించారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. “వావ్ గ్రేట్”, “గంగకు నమస్కారం”, “సూపర్ టాలెంట్”, “అద్భుతం” అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.