Site icon NTV Telugu

Goa Stampede: గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 50 మందికి గాయాలు

Goastampede

Goastampede

గోవాలోని షిర్గావ్‌ శ్రీ లైరాయ్ జాతరలో తొక్కిసలాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీంతో వారిని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో జరిగే జాతర అగ్నిగుండంపై నడిచే వార్షిక పండుగ. ఇందులో భాగంగా భక్తులు నిప్పులపై నడిస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి గాయాలయ్యాయి.

పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటో ఇంకా తెలియలేదు. బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రావల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీకి భారీ ఉరుములతో వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

పార్వతీ దేవి స్వరూపంగా లైరాయ్ దేవిని భక్తులు విశ్వసిస్తారు. దీంతో రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ జాతర యొక్క ప్రాముఖ్యత భక్తులు మండుతున్న నిప్పుల మీద నుంచి చెప్పులు లేకుండా నడుస్తుంటారు. అంతేకాకుండా లయబద్ధంగా డోలు కూడా వాయిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులంతా దేవి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.

ఇది కూడా చదవండి: Nagarjuna : పాన్ ఇండియా చిత్రాల పై నాగార్జున కామెంట్స్ వైరల్..

 

Exit mobile version