NTV Telugu Site icon

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ గ‌వ‌ర్న‌ర్ (100) క‌న్నుమూత‌

RL Bhatia

కాంగ్రెస్ పార్టీ మ‌రో సీనియ‌ర్ లీడ‌ర్‌ను కోల్పోయింది… మాజీ గవర్నర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌ఎల్‌ భాటియా క‌న్నుమూశారు.. ఆయ‌న వ‌య‌స్సు 100 సంవ‌త్స‌రాలు.. వయోభారంతో గ‌త కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన… శుక్ర‌వారం అస్వ‌స్థ‌త‌కు గురికాగా.. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు కుటుంబ‌స‌భ్యులు.. అయితే, చికిత్స పొందుతున్న భాటియా పరిస్థితి విషమించి… ఇవాళ క‌న్నుమూశారు.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ‌కాలం పాటు ప‌నిచేసిన ఆయ‌న‌… అమృత్‌సర్ లోక్‌స‌భ స్థానం నుంచి 1972 నుంచి 6 సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు.. గ‌వ‌ర్న‌ర్ గా కూడా సేవ‌లు అందించారు.. 2004 నుంచి 2008 వరకు… 2008 నుంచి 2009 వరకు కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వ‌హించారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఇక‌, ఆయ‌న మృతిప‌ట్ల కాంగ్రెస్ నేత‌లు, ఇత‌ర రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.