Site icon NTV Telugu

Chhattisgarh: రామ్‌దాహ జలపాతంలో మునిగి ఆరుగురు పర్యాటకులు మృతి

Ramdaha Waterfall

Ramdaha Waterfall

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో గల రామ్‌దాహ జలపాతంలో మునిగి 6 మంది కుటుంబసభ్యులు మృతి చెందారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న కోటడోల్ పీఎస్ పరిధి సరిహద్దులో దిగువన ఉన్న రామ్‌దాహ జలపాతం వద్ద ఆదివారం పిక్నిక్‌ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన 15 మంది కుటుంబసభ్యుల్లో ఏడుగురు జలపాతంలో పడిపోయారు. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు రక్షించబడ్డారు.

FaKe Engine Oil Gang Busted: నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ గ్యాంగ్ గుట్టురట్టు

అందరూ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ నివాసితులు అని కొరియా జిల్లా కలెక్టర్ కుల్దీప్ శర్మ వెల్లడించారు. జలపాతంలో ప్రజలు స్నానం చేయవద్దని హెచ్చరిక బోర్డును సైట్‌లో ఉంచినప్పటికీ, పర్యాటకులు లోతైన నీటిలోకి వెళ్లినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

Exit mobile version