Site icon NTV Telugu

Tamilnadu: ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు, 6గురు మృతి

Bus Accident

Bus Accident

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెంగల్పట్టు ప్రాంతంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. చెంగల్‌పట్టు జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. బస్సు తిరుచ్చి హైవేపై చెన్నై నుంచి చిదంబరం పట్టణానికి వెళ్తోంది.

Mahbubnagar Floods: వ‌ర‌ద‌లో చిక్కుకున్న పాఠ‌శాల బ‌స్సు.. బస్సులో 25 మంది విద్యార్థులు

స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version