Indian Sailors: పాకిస్తాన్ కరాచీ పోర్టులో సరకు రవాణా నౌకలో పనిచేస్తున్న ఆరుగురు భారతీయ నావికులు ఆరు నెలలకు పైగా చిక్కుకుపోయారు. వారు స్వదేశానికి తిరిగి రాలేకపోవడానికి కారణం షిప్పింగ్ కంపెనీ, సిబ్బందికి మధ్య ఉన్న వాణిజ్య వివాదమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నౌకను విడిచి పెట్టాలంటే వారి స్థానంలో ప్రత్యామ్నాయ సిబ్బంది రావాల్సి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాకిస్తాన్ అధికారులతో పాటు నౌక యజమాని, షిప్పింగ్ కంపెనీ, దాని ఏజెంట్‌తో సంప్రదింపులు జరుపుతుున్నట్లు తెలిపింది.
2026 ఏప్రిల్ నుంచి ఆరుగురు భారత నావికులు కరాచీ పోర్టులోనే చిక్కుకుపోయారు. నౌక యజమాని, స్థానిక పోర్టు అధికారులకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా సమస్య ఏర్పడింది. ఈ నౌకలో పనిచేస్తు్న్న వారిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చీఫ్ ఆఫీసర్ వినీత్ కిషోర్ మిశ్రా ఉన్నారు. అతడిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో పాకిస్తాన్ వైపు నుంచి భారత్ కాన్సులర్ సహాయం కూడా కోరింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి అప్పగించే అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అప్పగింత అనేది చట్టపరమైన ప్రక్రియ అని, దీనికి సంబంధించిన నిర్ణయాలు చట్టానికి అనుగుణంగా తీసుకుంటామని తెలిపారు. 19వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు 2027 జనవరి 7 నుంచి 9 వరకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరగనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి ప్రధాని కూడా హాజరవుతారని వెల్లడించారు.

