Site icon NTV Telugu

Uttarpradesh: రోడ్డు పక్కన కూర్చున్న వారిపై నుంచి దూసుకెళ్లిన వాహనం.. 6గురు మృతి

Chitrakoot Road Accident In Up

Chitrakoot Road Accident In Up

ఉత్తర్​ప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడ్‌తో వెళ్తున్న పికప్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే కూర్చున్న ఎనిమిది మంది వ్యక్తులపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లాలోని భరత్‌కప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌలి కళ్యాణ్‌పూర్ గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది.

మృతుల కుటుంబాలకు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబసభ్యులకు, రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

IMD: ఈ రోజు అత్యంత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ తాజా వార్నింగ్

రౌలి కళ్యాణ్‌పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని చిత్రకూట్ జిల్లా మేజిస్ట్రేట్ సంభ్రాంత్ శుక్లా తెలిపారు.పికప్ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన కూర్చున్న వ్యక్తులను తొక్కివేయడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారని, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని శుక్లా వెల్లడించారు.

Exit mobile version