Site icon NTV Telugu

నేడు భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు…

భారత్‌లో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి… ఈ రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 252 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెంచారు.. ఇదే పమయంలో 7,995 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 88,993 యాక్టివ్‌ కేసులు ఉండగా… ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,03,644కు చేరింది.. కోలుకున్నవారి సంఖ్య 3,41,38,763 కి పెరిగింది.. ఇక, మరణాల సంఖ్య 4,75,888 కి పెరిగినట్టు వెల్లడించింది.. మరోవైపు.. గత 24 గంటల్లో 66,98,601 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,33,88,12,577 వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది.

Exit mobile version